Gaddar | కవిగా, విప్లవకారుడిగా, గాయకుడిగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ (Gaddar). ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాయిచంద్, రామిరెడ్డి, తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రల్లో నటించిన మాభూమి (Maa Bhoomi) సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు గద్దర్. ఈ సినిమాలో వచ్చే బండెనక బండి కట్టి పాటలో కనిపిస్తారు గద్దర్. ఈ సాంగ్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
గద్దర్ రంగుల కల సినిమాలో కూడా నటించారు. ఆర్ నారాయణమూర్తి నటించిన ఓరేయ్ రిక్షా సినిమాలో గద్దర్ రాసిన మల్లెతీగకు పందిరి వోలే పాట ఆల్‌టైమ్ ఎవర్గ్రీన్ సూపర్ హిట్‌గా నిలిచింది. గద్దర్ ఈ పాటకు నంది అవార్డు వస్తే.. తిరస్కరించారు. 2011లో తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రంలో గద్దర్ రాసిన పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా (Podustunna Poddumeeda) సాంగ్ ఉద్యమానికి మరింత జోష్ నింపిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
పొడుస్తున్న పొద్దు మీద పాటతో గద్దర్ మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసి మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. గద్దర్ 2019లో సుడిగారి సుధీర్ నటించిన సాఫ్ట్వేర్ సుధీర్‌లో మేలుకో రైతన్న పాటను రాశారు. గద్దర్ చివరగా సత్యారెడ్డి స్వీయ దర్శకత్వంలో విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
బండెనక బండి కట్టి సాంగ్..
పొడుస్తున్న పొద్దు మీద సాంగ్..
మేలుకో రైతన్న సాంగ్..