Gadar 2 Movie Teaser |సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం బాలీవుడ్ లో గదర్ సినిమా సృష్టించిన రికార్డుల అంతా ఇంతా కాదు. అప్పట్లో ఈ సినిమా పెను సంచలనమే సృష్టించింది. ఈ ఒక్క సినిమాతో బాబీ డయాల్ పేరు మార్మోగిపోయింది. ఒక రోమ్ కామ్ సినిమా అప్పట్లోనే ఆ రేంజ్ కలెక్షన్లు సాధించిందంటే మాములు విషయం కాదు. ఇక అమీషా, బాబీ డయాల్ కెమిస్ట్రీ కొన్నేళ్ల పాటు ప్రేక్షకులకు గుర్తిండిపోయింది. ఇక ఇటీవలే ఈ సినిమాను రీ-రిలీజ్ చేస్తే తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. మూడు రోజుల్లోనే సుమారు కోటిన్నర కలెక్షన్లు సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కింది. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది.
తొలిపార్టుకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా 1971లో జరిగిన ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో జరుగుతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. అప్పట్లో పాకిస్తాన్ అంతటా క్రష్ ఇండియా నినాదాలు చేస్తూ, పోస్టర్లు అతికించనట్లు టీజర్ లో చూపించారు. యాక్షన్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్ తో సినిమాపై మరింత హైప్ పెరిగింది. అయితే హీరోయిన్ అమీషా పటేల్ ను మాత్రం టీజర్ లో చూపించలేరు. జీ స్టూడీయోస్ తో కలిసి అనీల్ శర్మ స్వయ నిర్మాణంలో ఈ సినిమాను తెరకెక్కించాడు.