రవికిరణ్ హీరోగా నటించిన చిత్రం ‘గదాధారి హనుమాన్’. రోహిత్ కొల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విరభ్ స్టూడియో పతాకంపై రేణుకాప్రసాద్, బసవరాజ్ నిర్మించారు. ఇటీవల టీజర్‌ను నిర్మాత సి.కల్యాణ్, రాజ్ కందుకూరి, సముద్ర ముఖ్య అతిథులుగా ఆవిష్కరించారు.
మైథలాజికల్ టచ్‌తో తీసిన కుటుంబ కథా చిత్రమిదని, వినూత్న కథాంశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. సాంకేతికంగా మంచి క్వాలిటీతో సినిమా తీశామని, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని హీరో రవికిరణ్ పేర్కొన్నారు.