సంధ్య ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘గాలి’. రామ్‌ప్రసాద్ గురజాడ, అంజలి, శ్రీకాంత్ పెరుమండ్ల, చిన్ని, రోజారాణి, బి.వి.సుబ్బారెడ్డి ప్రధాన పాత్రధారులు. టి.రాము దర్శకత్వంలో చందాలక్ష్మీ నారాయణ నిర్మించారు. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్‌ను విడుదల చేశారు.
కలి పురుషుడికి, అమ్మవారికి మధ్య జరిగే భీకర పోరాటం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుందని, ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపులతో మెప్పిస్తుందని దర్శకుడు తెలిపారు. డిసెంబర్ 25న చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్నె ప్రకాష్, సంగీతం: అనిల్ కుమార్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: టి.రాము.