గోదావరి నేపథ్యంలో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఆయ్’. నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మణిపుత్ర దర్శకుడు. బన్నీవాసు, విద్యా కొప్పినీడి నిర్మాతలు. ఆగస్ట్ 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ని నిర్మాతలు వేగవంతం చేశారు.
ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన వస్తున్నదని, సినిమా కూడా అంతకు మించి ఉంటుందని, మనసుల్ని హత్తుకునే ఉద్వేగాలు, మనసారా నవ్వుకునే సన్నివేశాలకు ఈ సినిమాలో కొదవుండదని మేకర్స్ చెబుతున్నారు. నార్నె నితిన్ కెరీర్‌కు ఈ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు. అగ్రనిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కళ్యాణి, సంగీతం: రామ్ మిర్యాల, నిర్మాణం: జిఏ2 పిక్చర్స్.