Funky Teaser | టాలెంటెడ్ యాక్టర్ విశ్వక్ సేన్ హీరోగా, ‘జాతిరత్నాలు’ ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘ఫంకీ’. కామెడీ, ఎంటర్టైన్మెంట్ మిక్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి ఆసక్తి ఏర్పడింది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు, అందులోని ఫన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో కాయదు లోహర్ హీరోయిన్గా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మాణం వహిస్తున్నారు.
‘ఫంకీ’ టీజర్ చూస్తుంటే, విశ్వక్ సేన్ ఓ సినిమా డైరెక్టర్ పాత్రలో కనిపిస్తుండగా, హీరోయిన్ కాయదు అతని సినిమా హీరోయిన్గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సాగే లవ్ స్టోరీకి అనుదీప్ మార్క్ హాస్యం మేళవించి సినిమాను పూర్తిగా ఫన్ రైడ్‌గా మలిచినట్లు స్పష్టమవుతుంది. డైలాగ్స్, క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిసి టీజర్‌ను హిలేరియస్‌గా మార్చేశాయి.
ప్రస్తుతం ‘ఫంకీ’ షూటింగ్ దశలో ఉంది. టీజర్ ద్వారా ప్రేక్షకుల్లో సినిమాపై క్యూరియాసిటీ పెంచిన చిత్రబృందం, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటన చేయనుంది. అనుదీప్ తనదైన స్టైల్లో కామెడీని పలికించే ప్రయత్నం చేస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులకు మంచి వినోదం అందించనున్నదనే నమ్మకం ఉంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైనమెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ మూవీ సినీ ఇండస్ట్రీపై సెటైరికల్‌గా తెరకెక్కుతుంది.
‘జాతిరత్నాలు’లాంటి సాలిడ్ కామెడీ ఎంటర్టైనర్ను అందించిన టాలెంటెడ్ దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రంతో మరోసారి కామెడీ జోనర్‌కి తిరిగి వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఫంకీ’ టీజర్ సినీ లవర్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పింది. సినిమా పూర్తిగా అనుదీప్ మార్క్ హాస్యంతో నిండి ఉంటుందని టీజర్ చూస్తే అర్ధమవుతుంది. గతంలో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ను బట్టి చూసుకుంటే, ‘ఫంకీ’ కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక దర్శకుడిగా మాత్రమే కాకుండా, నటుడిగా కూడా అనుదీప్ బిజీగా మారారు. ప్రస్తుతం ఆయన ‘మిత్ర మండలి’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ విధంగా దర్శకత్వం, నటన రెండింట్లోనూ అనుదీప్ తన టాలెంట్‌ను నిరూపించుకుంటూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు.