Funkey Movie | విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా గురించి కీలక విషయాలను వెల్లడించారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమా చిత్ర పరిశ్రమపై సెటైరికల్‌గా తెరకెక్కుతుందని ఇందులో విశ్వక్ దర్శకుడి పాత్రలో కనిపించబోతున్నారని విశ్వక్ తెలిపాడు. జాతిరత్నాలు, ప్రిన్స్ వంటి కామెడీ సినిమాలను తెరకెక్కించిన కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో తమిళ నటి కాయడు లోహర్ కథానాయికగా నటిస్తుండగా.. ప్రస్తుతం ఆమె డేట్స్ కోసం ఎదురుచూస్తున్నామని నాగవంశీ తెలిపాడు. ఫంకీలో ఇప్పటివరకు వచ్చిన అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని నాగవంశీ అన్నారు. ఈ సినిమా విశ్వక్ సేన్ కెరీర్‌కు, అలాగే దర్శకుడు కేవీ అనుదీప్‌కు చాలా ముఖ్యమైన చిత్రంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.