సండే రోజు ఇంటి సభ్యులతో దాక్కో దాక్కో మేక అనే గేమ్ ఆడించాడు నాగార్జున. ఈ టాస్క్‌లో పులి ..మేకని వేడాల్సి ఉంటుంది. 30 సెకన్లలో మేకను పట్టుకోకపోతే పులి చచ్చిపోతుందని, పులికి పనిష్మెంట్ ఉంటుందన్నాడు. ఒకవేళ మేకను పట్టుకుంటే మేక చచ్చిపోవడంతో పాటు వారికి పనిష్మెంట్ ఉంటుందని తెలిపాడు. ముందుగా శ్రీరామ్ బరిలోకి దిగాడు. హమీదాని వేటాడాడు. హమీదా తన శిక్షలో భాగంగా డ్యాన్స్ చేసి అలరించింది.
అనంతరం జెస్సీని పట్టుకోవడంలో విఫలమైన శ్వేత నాలుకతో ముక్కును టచ్ చేయాలనుకుంది. అది కుదరలేదు. సిరి చేసి చూయించింది. అనంతరం పులిలా వచ్చిన ప్రియాంక.. మానస్‌ను వెంటాడి వేటాడగా అతడు చిక్కకుండా ఉండేందుకు ప్రయత్నించి పూల్‌లో పడ్డాడు. ఓడిపోయిన మానస్ పదిసార్లు కప్ప గెంతులు వేశాడు.
తర్వాత ప్రియ.. సన్నీని పట్టుకోలేకపోవడంతో ఆమెను హూలా హూప్తో డ్యాన్స్ చేయమన్నాడు నాగ్. దాన్ని తిప్పేందుకు చాలా కృషి చేసింది. ఇక సిరి.. షణ్నును పట్టేసుకోగా ఓడిపోయిన షణ్ముఖ్‌తో బెల్లీ డ్యాన్స్ చేయించాడు నాగ్. పులిలా వచ్చిన కాజల్.. లోబో మీద పంజా విసరడంతో అతడు 15 పుషప్స్ చేయక తప్పలేదు. అనంతరం రవి.. యానీ మాస్టర్‌ను పట్టుకోవడంతో యానీ.. రవి చేతిలో ఓడిపోయానని డైలాగ్ చెప్తూ తీన్మార్ స్టెప్పులేసింది.