Aadikeshava Trailer | టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఆదికేశవ (Aadikeshava). PVT 4 ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్లో వస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. మేకర్స్ తాజాగా ఆదికేశవ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
ఏ పనీ పాటలేకపోయినా ఎంత స్టైల్‌గా ఉంటాడు మా వాడు.. అంటూ హీరో ఇంట్రడక్షన్‌తో మొదలైంది ట్రైలర్. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ సాఫీగా సాగుతుంది. ఆ తర్వాత విలన్ ఎంట్రీ ఇస్తూ..రాముడు లంక మీద పడింది వినుంటావ్.. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టా ఉంటదో నేను చూపిస్తా.. చెప్పే సంభాషణులు ఆకట్టుకుంటున్నాయి. నేను అయోధ్యలో ఉండే రాముడిని కాదప్పా.. ఆ రావణుడు కొలిచే రుద్రకాళేశ్వరుడిని అంటూ ఆదికేశవ చెప్పై డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఆది కేశవ టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఆదికేశవ గ్లింప్స్ వీడియోలో ‘అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటుండగా.. వైష్ణవ్ తేజ్ ఆ రౌడీల అంతు చూసే యాక్షన్ సన్నివేశాలు సినిమాపై ఇప్పటికే సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
వైష్ణవ్ తేజ్ ఈ సారి పక్కా యాక్షన్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో క్లారిటీ ఇచ్చేశాడు. ఈ మూవీలో బీస్ట్ ఫేం అపర్ణా దాస్, జోజు జార్జ్ ఇతం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆదికేశవ ట్రైలర్..
Presenting you all the trailer of Love, Fun & Action Packed Entertainer ~ #Aadikeshava 💥🔥#AadikeshavaTrailer Out Now – https://t.co/zlcL5muFBh
In Cinemas #AadikeshavaOnNov24th 💥#PanjaVaisshnavTej @sreeleela14 @gvprakash #JojuGeorge @aparnaDasss #SrikanthNReddy… pic.twitter.com/rRymwcnyr2
— Sithara Entertainments (@SitharaEnts) November 20, 2023
హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్..
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..