Sangeeth Sobhan | మరో హిట్టుపై నిహారిక కన్ను.. ఇంట్రెస్టింగ్గా సంగీత్ శోభన్ ‘రాకాస’ గ్లింప్స్
Sangeeth Sobhan | నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా నిర్మిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Sangeeth Sobhan | నిహారిక కొణిదెల తన ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. ‘కమిటీ కుర్రోళ్లు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఈ సినిమా నిర్మిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ కథానాయకుడిగా నటిస్తుండగా మాసన శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.
ఈ గ్లింప్స్ ప్రారంభంలో ఎంతో గంభీరంగా సాగుతూ.. యుగయుగాలుగా ప్రతీ కథలోనూ ఒక సమస్య ఉంటుందని, దాన్ని పరిష్కరించేందుకు ఒక వీరుడు పుడతాడని, ఆ వీరుడు తనేనంటూ హీరో ఇచ్చే ఎలివేషన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంది. అయితే వెంటనే కథలో కామెడీ, సెటైరికల్ ట్విస్ట్ మొదలై ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతుంది. సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి మెప్పించనున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది. నయన్ సారిక హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. నిహారిక కొణిదెలతో కలిసి ఉమేష్‌కుమార్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ క్రేజీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

