Oscars 2025 | సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక సోమవారం అమెరికా లాంస్ ఎంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలలో అనోరా చిత్రం ఏకంగా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇక ఆస్కార్ బరిలో పదమూడు నామినేషన్స్ దక్కించుకున్న మ్యూజికల్ డ్రామా ‘ఎమిలియా పెరేజ్’ కేవలం రెండు అవార్డులకే పరిమితమైంది. మరోవైపు భారత్ నుంచి నామినేట్ అయిన అనుజా చిత్రానికి నిరాశే ఎదురైంది. అయితే ఆస్కార్ అందుకున్న చిత్రాలు ఏ ఓటీటీలో ఉన్నాయి అనేది చూసుకుంటే.
అనోరా – జీ5, జియో హట్ స్టార్
Anora
97వ ఆస్కార్ వేడుకలలో అత్యధిక అవార్డులను సాధించిన చిత్రం ‘అనోరా’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో పురస్కారాలను గెలుచుకొని సంచలనం సృష్టించింది. సీన్ బేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మైకీ మ్యాడిసన్, మార్క్ ఎడిల్జియన్, యురా బోరిసావ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఓ సెక్స్ వర్కర్ కథ ఆధారంగా అనోరా తెరకెక్కింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో రెంటల్‌లో విధానంలో అందుబాటులో ఉంది.
ది సబ్ స్టాన్స్ – ప్రైమ్ వీడియో
The Substance
2024లో హాలీవుడ్ నుంచి వచ్చి సంచలన విజయం అందుకున్న చిత్రం ది సబ్ స్టాన్స్(The Substance). ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటి డెమీ ముర్ కథానాయికగా నటించగా.. కోరలీ ఫార్గేట్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్(Best makeup and hairstyling) విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌తో పాటు ముబీలో స్ట్రీమింగ్ అవుతుంది.
ది బ్రూటలిస్ట్ – యాపిల్ టీవీ – ప్రైమ్ వీడియో
The Brutalist
హాలీవుడ్ నటుడు ఆడ్రియన్ బ్రాడీ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ది బ్రూటలిస్ట్(). బ్రాడీ కార్బెట్(Brady Corbet ) దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ నుండి అమెరికాకు వలస వస్తాడు ఆర్కిటెక్ట్ లాస్లో టోత్ (ఆడ్రియన్ బ్రాడీ). యూరప్ నుంచి అమెరికా రావడంతో ఒక వలసదారుడిగా అనేక సవాళ్లు అతడికి ఎదురవుతాయి. అయితే అతడు అమెరికాలో ఎలా నిలదోక్కుకున్నాడు అనేది ఈ సినిమా కథ. ఇక ఈ సినిమాలో నటనకు గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడమే కాకుండా.. ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ సినిమాటోగ్రాఫీ అవార్డులను ఈ చిత్రం అందుకుంది. ఈ చిత్రం ప్రైమ్‌లో అందుబాటులో ఉండగా.. ఇండియాలో చూడడానికి యాక్సెస్ లేదు. మరో ఓటీటీ వేదిక యాపిల్ టీవీలో ఇది అందుబాటులో ఉంది.
ఏ రియల్ పెయిన్ – యాపిల్ టీవీ – డిస్నీ
A Real Pain
97వ ఆస్కార్ వేడుకలలో అవార్డు అందుకున్న మరో చిత్రం ఏ రియల్ పెయిన్(). ఈ సినిమాలో నటనకు గాను కిరెన్ కల్కిన్ ఉత్తమ సహయక నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక యాపిల్ టీవీతో పాటు డిస్నీ హూలులో స్ట్రీమింగ్ అవుతుంది.
ఎమిలియా పెరెజ్- ప్రైమ్ వీడియో
Emilia Pérez
ఈ ఆస్కార్ అవార్డు వేడుకలలో ఆనోరా, ది సబ్‌స్టాన్స్ చిత్రాల తర్వాత అత్యధికంగా వినిపించిన చిత్రం ఎమిలియా పెరెజ్(Emilia Pérez). ఏకంగా 13 నామినేషన్స్ దక్కించుకున్న ఈ చిత్రం కేవలం రెండు అవార్డులను మాత్రమే గెలుచుకుంది. ఇక ఈ చిత్రంలో నటనకు గాను నటి జోయా సాల్దానాకు ఉత్తమ సహయక నటిగా అవార్డు అందుకోవడంతో పాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో కూడా ఈ చిత్రం అవార్డును అందుకుంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో అందుబాటులో ఉంది.
ఇంకా ఇవే కాకుండా..
ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – ఐయామ్ స్టిల్ ఇయర్ (అమెజాన్ ప్రైమ్)
Iam Stil Here
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ – నో అదర్ ల్యాండ్ (అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో (అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ సౌండ్ – డూనే పార్ట్ 2 (అమెజాన్ ప్రైమ్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే – కాంక్లేవ్ (అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ)
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ – ఐయామ్ నాట్ ఏ రోబోట్ ( యూట్యూబ్)