Hug My Younger Self | సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘జెమినీ ఏఐ’ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు చాట్‌జీపిటీని వాడిన నెటిజన్లు ఒక్కసారిగా గూగుల్ జెమినీ ఏఐకి షిప్ట్ అయ్యారు. దీనికి ముఖ్య కారణం జెమినీలో ఉన్న కొత్త ఫిచర్సే. నానో బానానా అంటూ వచ్చి 3డీ యానిమేషన్లతో ట్రెండింగ్‌లో నిలిచిన జెమినీలో తాజాగా మరో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం ఇందులో హగ్ ఫర్ మై యంగర్ సెల్ఫ్ (Hug My Younger Self) అనే ట్రెండ్ వైరల్ అవుతోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా నెటిజన్లు తమ చిన్ననాటి ఫొటోను, ప్రస్తుత ఫొటోను కలిపి ఒకే ఫొటోగా క్రియేట్ చేస్తున్నారు. ఇందులో ప్రస్తుత రూపంలో ఉన్న వారు చిన్ననాటి తమను హత్తుకుంటున్నట్లుగా లేదా కౌగిలించుకుంటున్నట్లుగా ఎడిట్ చేస్తున్నారు.
ఈ ట్రెండ్‌లో భాగంగా ఒక అభిమాని అలియా భట్ చిన్ననాటి ఫొటో, ప్రస్తుత ఫొటోను కలిపి ఒక పోలరాయిడ్ తరహా చిత్రాన్ని రూపొందించారు. ఆ ఫోటోలో అలియా తన చిన్ననాటి ప్రతిరూపాన్ని హత్తుకుంటున్నట్లుగా ఉంది. ఈ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీపోస్ట్ చేస్తూ అలియా భట్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. కొన్నిసార్లు మనం మనలో ఉన్న ఎనిమిదేళ్ల పసిపాపను హత్తుకోవాలి అని రాస్తూ ఆ ఫొటోను షేర్ చేసింది ఆలియా భట్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. మరోవైపు ఇదే ట్రెండ్‌లో బాలీవుడ్ తారలు ఐశ్వర్యతో పాటు దీపిక పదుకొనే, ప్రజాక్త కోలీ, శ్రద్ధ కపూర్ తదితరులు భాగమయ్యారు.

Aishwarya Rai

Alia Bhatt

Ananya Pandey

Deepika padukone

Katrina Kaif

Shradda Kapoor 1