గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ (RRR). ఏదో ఒక అప్డేట్తో వార్తల్లో నిలుస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. కాగా ఇటీవలే ఈ సినిమాలోని నాటు నాటు (Naatu Naatu song) పాట 95వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‌లో షార్ట్‌లిస్ట్ జాబితాలో చోటుదక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాటకు స్థానం దక్కింది.
ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ భారతీయ సినీ పరిశ్రమ మొత్తానికి చారిత్రక క్షణం. అకాడమీ అవార్డ్స్ లో షార్ట్ లిస్ట్ అయిన తొలిపాటగా నాటునాటు నిలవడం కంటే గొప్ప గౌరవం మరొకటి లేదు. ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణిగారు మీ విజన్ మ్యాజిక్..అని ట్వీట్ చేశాడు రాంచరణ్ . తాజాగా ఈ ట్వీట్‌కు టైటానిక్ నటి ఫ్రాన్సెస్ ఫిషర్ స్పందించింది.
రాంచరణ్‌ను ప్రశంసలతో ముంచెత్తింది ఫ్రాన్సెస్ ఫిషర్ . స్టంట్స్, డ్యాన్స్ , యాక్టింగ్ చేయడంలో రాంచరణ్ శారీరక సామర్థ్యం అసాధారణంగా ఉందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. టైటానిక్ చిత్రంలో హీరోయిన్ తల్లిగా నటించింది ఫ్రాన్సెస్ ఫిషర్.
లాస్ ఏంజెల్స్‌లోని ప్రపంచ అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ కలిగిన TLC Chinese Theaterలో 2023 జనవరి 9న స్పెషల్ స్క్రీనింగ్ కానుంది ఆర్ఆర్ఆర్. డైరెక్టర్ రాజమౌళి, లీడ్ యాక్టర్లు రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్‌తోపాటు ఎంఎం కీరవాణి కలిసి ఈ షోలో సందడి చేయనున్నారు.
Your physical aptitude to do your stunts AND to dance & sing, and to act in your scenes was remarkable!
I bet y’all had a blast!— Frances Fisher (@Frances_Fisher) January 3, 2023