BISON | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ (Dhruv Vikram) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం బైసన్ (Bison). స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అక్టోబర్ 24న గ్రాండ్‌గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏదో ఒక అప్డేట్ అందిస్తూ మూవీ లవర్స్‌లో ఎక్జయిట్‌మెంట్‌ను పెంచేస్తున్నారు మేకర్స్. రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉన్ననేపథ్యంలో కొత్త పోస్టర్ షేర్ చేశారు. ఆ మృగం మేల్కొనడానికి ఇంకా 5 రోజులు మాత్రమే ఉంది.. అంటూ రిలీజ్ చేసిన నయా పోస్టర్లో సినిమాలోని పాత్రలు ఎలా ఉండబోతున్నాయో మరోసారి హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
షార్ట్ హెయిర్‌లో ధ్రువ్ విక్రమ్, పల్లెటూరి అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుండగా.. మిగిలిన పాత్రలు, యాక్టర్లకు సంబంధించిన లుక్స్ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ధ్రువ్ విక్రమ్ టీం ఈ సారి గట్టిగానే బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది.
ఇప్పటికే షేర్ చేసిన బైసన్ లుక్‌లో బ్యాక్ డ్రాప్లో అడవిదున్న కనిపిస్తుండగా.. దాని ముందు కండలు తిరిగిన దేహంతో రన్నింగ్‌కు రెడీ అన్నట్టుగా ఉన్న ధ్రువ్ విక్రమ్ స్టిల్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Just 5 days till the beast awakens 🦬💥
Brace yourselves #Bison is raiding the big screens on October 24th! 🔥#BisonOnOct24 🦬#BisonTelugu@ApplauseSocial @NeelamStudios_ #SameerNair @deepaksegal @beemji @Tisaditi #DhruvVikram @anupamahere @LalDirector @PasupathyMasi… pic.twitter.com/CLD2mRarnY
— BA Raju’s Team (@baraju_SuperHit) October 19, 2025