Nandini Reddy | టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న తాజా చిత్రం అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). టాలెంటెడ్ దర్శకురాలు నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకా దత్ స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిట్ చాట్ చేశారు నందినీరెడ్డి. సినిమా విశేషాలు ఆమె మాటల్లోనే..
ఫ్యామిలీ ఎంటర్టైనర్లలో నవలాత్మకంగా చూపించడం ఫిల్మ్ మేకర్‌గా, మీకు ఛాలెంజ్‌గా అనిపించిందా..?
అన్నీ మంచి శకునములేలో సంతోష్, మాళవిక సహా ఏడు ప్రధాన పాత్రలు ఉంటాయి. ఇతర పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ పాత్రల గురించి మీరు చాలా ఎక్కువ చూడొచ్చు. ప్రతిదీ ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన కథలను నేను ఎక్కువగా ఇష్టపడతా.. కానీ అలాంటి కథలు రాయడం చాలా కష్టం.
కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచులు, ప్రాధాన్యత మారాయి.. అందుకు మీరు కథలో ఏమైనా మార్పులు చేశారా..?
మేమెప్పుడు సంతృప్తి చెందలేదు. స్టోరీని మరింత మెరుగుపరిచేందుకు పనిచేస్తూనే ఉన్నాం. ఓ బేబి సినిమాకు ముందు కూడా ఇలాగే పనిచేశాం. అందుకే ఈ కథలో కూడా చాలా మార్పులు చేశాం.
పెద్ద హీరోతో ఈ సినిమా చేయాల్సిందట.. నిజమేనా..?
లేదు. ఇది నిజం కాదు. ఎవరూ కూడా నన్ను యాక్షన్, ఫైట్స్ లాంటి విషయాలేం అడగలేదు. కానీ ఇతర కారణాల వల్ల సినిమా చేయలేకపోయారు. ఈ కథలో నన్నెవరూ యాక్షన్ సన్నివేశాలు పెట్టాలని అడగలేదు. కథలో ఫైట్స్ ఇమడవు.
ప్రొడక్షన్ బ్యానర్‌కు ట్రాక్ రికార్డు ఉంది..మీపై ఏమైనా ఒత్తిడి ఉండేదా..?
నలుగురు బ్యాట్స్ మెన్స్ సెంచరీలు కొడితే.. ఖచ్చితంగా నెక్ట్స్ వచ్చే బ్యాట్స్ మెన్‌పై ఒత్తిడి ఉంటుంది. నాపై ఒత్తిడి ఉంది.. కానీ సినిమా చూసిన వారి నుండి వచ్చిన రియాక్షన్‌ను చూశాక.. కూల్‌గా ఉన్నాను.
మిక్కీ జే మేయర్ గురించి ఏం చెప్తారు..?
సినిమాకు ఆత్మ లాంటి వ్యక్తి. సినిమా మొదలు పెట్టకముందు ఈ సినిమాలో నీ కంటే పెద్ద సూపర్ స్టార్ ఎవరూ లేరని అతనితో చెప్పాను. ఇతర అంశాలేమి పట్టించుకోకుండా కేవలం కథను నమ్మి చేయడం నా కెరీర్లో తొలిసారి. కథకు న్యాయం చేయాలనుకున్నా. క్లైమాక్స్ లో పెద్ద పెద్ద డైలాగ్స్ లాంటివేమీ ఉండవు