అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లరి నరేష్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలోని ఫస్ట్సింగిల్ ‘దేవేరి..’ అనే గీతాన్ని ఈ నెల 19న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘అందమైన రొమాంటిక్ గీతమిది. చక్కటి ప్రణయ భావనలకు అద్దం పడుతుంది. మెలోడీగా మెప్పిస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సిద్, సంగీతం: శ్రీచరణ్ పాకాల, నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది.