వెంకటేష్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం ‘నారప్ప’. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేష్‌బాబు, కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘చిలిపి చూపుల చలాకీ చిన్నమ్మీ..’ అనే పల్లవితో సాగే గీతాన్ని ఆదివారం చిత్రబృందం విడుదలచేసింది. అనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించిన ఈ గీతాన్ని ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ ఆలపించారు. మణిశర్మ స్వరకర్త. నిర్మాతలు మాట్లాడుతూ ‘నారప్ప కుటుంబం పెళ్లిచూపులకు వెళ్తున్న సందర్భంలో వచ్చే గీతమిది. ఫ్యామిలీ పాటకు రొమాంటిక్ టచ్‌ను ఇస్తూ సంగీత దర్శకుడు మణిశర్మ అద్భుతమైన బాణీలను అందించారు. కుటుంబబంధాలు, ప్రేమ, యాక్షన్ అంశాల కలబోతగా సాగే చిత్రమిది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదలతేదీని వెల్లడిస్తాం’ అని తెలిపారు. కార్తిక్త్న్రం, రావురమేష్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్ కె నాయుడు, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్.