అగ్ర హీరో వెంకటేష్ కథానాయకుడిగా ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశేషం. ఆయన కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో భారీ యాక్షన్ హంగులతో రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో వెంకటేష్ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని తెలిసింది.
తన తొలి రెండు చిత్రాలు హిట్, హిట్-2లో హీరోల్ని పోలీస్ పాత్రల్లో శక్తివంతంగా ప్రజెంట్ చేసిన శైలేష్ కొలను ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్‌ను కొత్తగా డిజైన్ చేశారని చెబుతున్నారు. ైస్టెలిష్ మేకోవర్‌తో ఆయన కనిపిస్తారని సమాచారం. గతంలో ‘ఘర్షణ’ ‘బాబు బంగారం’ వంటి చిత్రాల్లో వెంకటేష్ పోలీస్ పాత్రల్ని పోషించిన విషయం తెలిసిందే. చాలా విరామం తర్వాత ఆయన పోలీస్ పాత్రలో కనిపించబోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ‘సైంధవ్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.