Richa Chadha | బాలీవుడ్ భామ రిచా చద్ధా టెలివిజన్‌లో గ్రాండ్‌గా కనిపించనుంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న హిస్టారికల్ సీరియల్ ‘హీరామండి’లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నది! బుల్లితెరపై అలరించడానికి సిద్ధమవుతున్న రిచా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ‘నేను సోషల్ మీడియాలో చురుగ్గానే ఉంటాను. అయితే, దానివల్ల ప్రయోజనం ఏంటో ఇప్పటికీ అర్థం కాదు. మనం రియల్ లైఫ్‌ను వదిలేసి, ఇంటర్నెట్లో బతికేస్తున్నాం. కానీ, నేను మరీ అంతకాదు! నా అభిప్రాయాలు పంచుకునే వరకే దీనిని పరిమితం చేశాను’ అని చెబుతున్నది రిచా.
నటిగా ఎన్నో ఎగుడుదిగుళ్లు చూశానంటున్న ఆమె… ‘నటన అనుకున్నంత ఈజీ కాదు. కొన్నిసార్లు మనం ఎంచుకున్న పాత్ర చేయగలమా అన్న సందేహం వస్తుంది. ఈ విషయాన్ని ఎంతోమంది నటులను అడిగాను. వారంతా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చార’ని చెప్పుకొచ్చింది. సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్లో పనిచేయడం గర్వంగా ఉందంటున్న రిచా.. మనీషా కొయిరాలా, అదితి రావు హైదరీ లాంటి తారాగణంతో కలిసి నటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నది.