బీమ్లానాయక్, బింబిసార, సార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మలయాళీ భామ సంయుక్త మీనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో వరుస చిత్రాలతో బిజీగా ఉంది. నేడు సంయుక్త మీనన్ జన్మదినం. ఈ సందర్భంగా ఆమె తాజా చిత్రం ‘స్వయంభూ’ నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుద చేశారు. నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇందులో నిఖిల్ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్లో సంయుక్తమీనన్ విల్లంబులు సంధిస్తూ పోరాటయోధురాలిగా కనిపిస్తున్నది. కథాగమనంలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, యాక్షన్ ఘట్టాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. ఠాగూర్ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలావుండగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రంలో కూడా సంయుక్తమీనన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 400 ఏండ్ల నాటి గుడి నేపథ్య కథాంశమిది. ఈ సినిమాలో సమీర పాత్రలో సంయుక్త మీనన్ ఫస్ట్‌లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఇందులో ఈ భామ ఆధునిక భావాలు కలిగిన యువతిగా కనిపిస్తుందని మేకర్స్ తెలిపారు.