అగ్ర హీరో ధనుష్ హాలీవుడ్లో అరంగేట్రం చేస్తూ నటించిన చిత్రం ‘ది గ్రే మ్యాన్’. యాక్షన్ చిత్రాల దర్శకులుగా పేరు పొందినర రూసో బ్రదర్స్ ఆంటోని, జో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని ముంబైలో ప్రదర్శించబోతున్నారు. ఇందుకోసం రూసో బ్రదర్స్ భారత్‌కు రానున్నారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రయాణం ఓ రోలర్‌కోస్టర్ రైడ్‌లా జరిగింది. యాక్షన్‌తో పాటు చక్కటి డ్రామా..భారీ పోరాట ఘట్టాలు ఉంటాయి. పేరున్న సాంకేతిక నిపుణులతో పనిచేయడం కొత్త అనుభూతినిచ్చింది’ అని అన్నారు. మార్క్ గ్రీన్ రాసిన ‘ది గ్రే మ్యాన్’ పుస్తకం ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని రూపొందించారు.