దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భాగ్యశ్రీ కథానాయికగా నటిస్తున్నది. సోమవారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ‘1950 మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఆనాటి మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులు, సంక్లిష్టతలకు అద్దం పడుతుంది. దుల్కర్ సల్మాన్ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డాని శాంచెజ్ లోపెజ్, సంగీతం: జాను, నిర్మాతలు: రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్, దర్శకత్వం: సెల్వమణి సెల్వరాజ్.