తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఓ! సుకుమారీ’. భరత్ దర్శన్ దర్శకుడు. మహేశ్వరరెడ్డి మూలి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని ఐశ్వర్య రాజేష్ ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చిందని మేకర్స్ చెబుతున్నారు. ఈ క్రమంలో సోమవారం తిరువీర్ ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు.
రగ్గ్డ్, మాసీ లుక్‌లో వీధిలో నడుచుకుంటూ వస్తున్న తిరువీర్‌ని ఈ స్టిల్‌లో చూడొచ్చు.. స్లీవ్ లెస్ బనియన్, లుంగీ, భుజాలపై వేసుకున్న తువ్వాలు, కర్లీ హెయిర్, గడ్డం, నోట్లో టూత్‌బ్రెష్ మొత్తంగా పక్కా రూరల్ గెటప్పులో ఆయన ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు. ఇందులో ఆయన ‘యాదగిరి’ అనే పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: సీహెచ్ కుషేందర్, సంగీతం: భరత్ మంచిరాజు.