పాయల్ రాజ్‌పుత్, సునీల్, విరాజ్ అశ్విన్, రజత్ రాఘవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మాయా పేటిక’. ఈ చిత్రాన్ని జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ రాపార్తి మాట్లాడుతూ…‘ఈ చిత్ర స్క్రిప్ట్ సరికొత్తగా ఉంటుంది. సెల్‌ఫోన్ మోడల్‌గా ఈ సినిమాను రూపొందించాం. ఫోన్లో ఉన్నట్లే ఇందులో మంచి విజువల్స్, పాటలు, కామెడీ లాంచి ఫీచర్స్ ఉంటాయి’ అన్నారు. నటి పాయల్ రాజ్‌పుత్ మాట్లాడుతూ…‘ఇలాంటి చిత్రంలో అవకాశం రావడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ కథ కోసం దర్శకుడు మంచి రీసెర్చ్ చేశారు. ఇప్పటిదాకా నేను కనిపించని క్యారెక్టర్ ఇందులో పోషించాను’ అని చెప్పింది.