Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మొదటి వారం పూర్తయింది. ఫస్ట్ ఎలిమినేషన్లో కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. మొదటి రోజే కాన్ఫిడెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ జోరును కొనసాగించలేకపోయింది. అంత యాక్టివ్‌గా కనిపించకపోవడంతో పాటు కంటెంట్ ఇవ్వలేకపోవడం వల్ల కెమెరాల్లో కూడా ఎక్కువగా ఫోకస్ కాలేదు. ఈ క్రమంలో ఆడియెన్స్ ఆమెకు ఓట్లు వేయకపోవడంతో మొదటి వారంలోనే ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే, దీనిపై ఆమె ఏ మాత్రం ఫీల్ కావడం లేదు. “ఏదైనా ఓకే” అంటూ కూల్‌గా స్పందించింది.
నాగార్జున ఓపెనింగ్ రోజున “తనకు సాంగ్ కొరియోగ్రఫీ చేయాలి” అని చెప్పగా, వారం రోజుల్లోనే ఆ అవకాశాన్ని రాబట్టడం గమనార్హం. ఇక ఎలిమినేషన్ సందర్భంగా ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. హౌజ్‌లో జెన్యూన్ పర్సన్స్ అంటే రాము రాథోడ్, మర్యాద మనీష్, హరిత హరీష్ వీరంతా నిజాయితీగా, హెల్ప్‌ఫుల్‌గా ఉంటారని చెప్పింది. అలాగే ఫ్లోరా సైనీని “స్వీట్ సోల్”గా అభివర్ణించింది. ఫేక్ & డబుల్ గేమర్స్ లిస్ట్లొఓ భరణి ఫేక్ పర్సన్ అని, తన నమ్మకాన్ని కోల్పోయాడని చెప్పింది. రీతూ చౌదరి కెమెరా ముందు ఒకలా, వెనక మరోలా ఉంటుందని, తనూజ కూడా నమ్మకాన్ని బ్రేక్ చేసిందని పేర్కొంది.
ఆదివారం ఎపిసోడ్లో మిరాయ్ మూవీ టీమ్ హౌస్‌లో సందడి చేసింది. హీరో తేజ సజ్జా హీరోయిన్ రితికా నాయక్ తో పాటు నిర్మాత జీ విశ్వప్రసాద్ కూడా స్టేజ్‌పైకి వచ్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. తేజ–రితికాలతో పాటు కంటెస్టెంట్లతో ఫన్ గేమ్స్ ఆడించారు నాగ్. పాట పేరును బొమ్మల రూపంలో వేసి, గెస్ చేయాల్సిన టాస్క్‌లో ఓనర్స్ టీమ్ విజయం సాధించింది. టెనెంట్స్ మధ్య ప్రత్యేక టాస్క్ నిర్వహించి, భరణి ని కొత్త ఓనర్‌గా ఎంపిక చేశారు. ఆయనకు అసిస్టెంట్‌గా తనూజను ఎంపిక చేశారు. దీంతో సోమవారం నుంచి భరణి అధికారికంగా ఓనర్స్ జాబితాలో చేరిపోయారు.