కొంత కాలంగా సినీ పరిశ్రమలో ‘మా ’ అధ్యక్ష (Maa Elections) (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల అంశం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ‘మా’ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠ కు ఎట్టకేలకు తెరపడింది. మా ఎన్నికల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 10న మా ఎన్నికలను నిర్వహించనున్నట్టు ‘మా’ క్రమ శిక్షణా సంఘం వెల్లడించింది. తాజా ప్రకటనతో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇక ప్రచారంలో దూసుకెళ్లనున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ప్రధానంగా నలుగురు అభ్యర్థులు పోటీ పడుతుండటం, వారికి తోడుగా మరికొంతమంది కూడా పోటీ చేస్తామనడంతో ‘మా ’ అధ్యక్ష ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ (Prakash Raj) , మంచు విష్ణు (Manchu Vishnu), సీవీఎల్ నరసింహరావు, హేమ, జీవిత ప్రధానంగా బరిలో ఉన్నట్టు సమాచారం. వీరితోపాటు మరికొందరు ఎన్నికల్లో పోటీచేస్తారని వార్తలు ఇప్పటికే తెరపైకి వచ్చాయి. మరి చివరి నిమిషంలో ఎవరైనా బరిలోకి దిగుతారా..? లేదంటే ఏకగ్రీవంవైపు అడుగులు వేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.
ఇటీవలే మా సర్వసభ్య సమావేశం వర్చువల్ గా (Maa Virtual Meeting) గా జరిగిన విషయం తెలిసిందే. సినీరంగానికి చెందిన సీనియర్ నటులు, ప్రముఖులు, సాంకేతిక నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక వారం రోజుల్లోనే మా ఎన్నికల తేదీ ప్రకటిస్తామని ఇప్పటికే కృష్టంరాజు, మురళీమోహన్ వెల్లడించారు. సమావేశం జరిగిన ఐదు రోజుల్లోనే ఎన్నికల తేదీ ప్రకటన రావడంతో అభ్యర్థులు నయా జోష్‌తో ముందుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రస్తుత మా అధ్యక్షుడు నరేశ్ వెల్లడించనున్నారు.
‘మా’ నిబంధనల ప్రకారం 21 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని సినీ నటుడు, ‘మా’ అధ్యక్ష అభ్యర్థి ప్రకాష్‌రాజ్ సూచించారు. అయితే ప్రకాశ్ రాజ్ చెప్పినట్లు చేస్తే సెప్టెంబర్ 12 లోపే నిర్వహించాలి. అయితే ప్రస్తుతం కరోనా ఇంకా పోలేదు.. పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. అందుకే సెప్టెంబర్ రెండో వారం నుంచి అక్టోబర్ రెండో వారం మధ్య ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ మధ్యే మా కమిటీ చెప్పింది. ఇప్పుడు చెప్పినట్లుగానే అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించారు.
MAA Elections for the Term of 2021-2023 will be held on Oct 10th, 2021 #MAA pic.twitter.com/DTXw1b3YlV
— BA Raju's Team (@baraju_SuperHit) August 25, 2021
ఇవికూడా చదవండి..
Seetimaarr |ఈల వేసేందుకు గోపీచంద్ రెడీ..సీటీమార్ రిలీజ్ డేట్ ఫిక్స్
Chiranjeevi |ముఠామేస్త్రి స్టైల్ లో చిరంజీవి..షేర్ చేసిన బాబీ
Bandla Ganesh | ఇంట్రెస్టింగ్ అప్డేట్..హీరోగా బండ్లగణేశ్..!