టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటిస్తోన్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టు భీమ్లా నాయక్ (Bheemla Nayak). సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. ఈ మూవీ లాస్ట్ డే షూట్ అంటూ ఇప్పటికే ఓ అప్డేట్ సోషల్‌మీడియాను రౌండప్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఫైనల్ అప్ డేట్ ఇచ్చేశారు మేకర్స్. భీమ్లా నాయక్ షూటింగ్‌కు పవన్ కల్యాణ్ అండ్ టీం ప్యాకప్ చెప్పేసింది.
భీమ్లా నాయక్ షూటింగ్ పూర్తయింది అంటూ డైరెక్టర్ సాగర్ కే చంద్ర (Saagar K Chandra) ట్విటర్ లో పవన్ తో కలిసి దిగిన స్టిల్‌ను పోస్ట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా..డానియల్ శేఖర్ పాత్రలో రానా నటిస్తున్నాడు. కోలీవుడ్ భామ నిత్యమీనన్, మాలీవుడ్ బ్యూటీ సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా రవి కే చంద్రన్ కెమెరా వర్క్ చేస్తున్నాడు.
It’s a wrap for Bheemla Nayak shooting 🔥🔥🔥 #BheemlaNayakOn25thFeb 🤩#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @vamsi84 @sitharaents @adityamusic pic.twitter.com/Iel2Za1lYs
— Saagar K Chandra (@saagar_chandrak) February 17, 2022
ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో పవన్ కల్యాణ్‌తో అప్ కమింగ్ మూవీస్ డైరెక్టర్లు హరీష్ శంకర్, క్రిష్ దిగిన ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.