Rajamouli – Mahesh Project | గత కొన్నిరోజులుగా షూటింగ్‌తో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కి వెళ్లాడు. రాజమౌళి మహేశ్ పాస్‌పోర్ట్‌ని తిరిగిఇవ్వడంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చాడు ప్రిన్స్. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో ప్రియంకా చోప్రా కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.
అయితే ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రాజమౌళి మహేశ్ పాస్‌పోర్ట్‌ని లాక్కొని ఎటు వెళ్లకుండా చేసినట్లు ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వీడియో కూడా అప్పుడు పాపులర్‌గా మారింది. అయితే ఆ వీడియోకు తాజాగా కౌంటర్ ఇచ్చాడు మహేశ్ బాబు. నా పాస్‌పోర్ట్ నాకు వచ్చినట్లు ఒక వీడియోను విడుదల చేశాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
— oærmy (@ssmbbakthudu) April 5, 2025
Finally Babu gets his passport back 😜@urstrulyMahesh #SitaraGhattamaneni#SSMB29 pic.twitter.com/mfjdOUskLd
— Mahesh Babu Space (@SSMBSpace) April 5, 2025