ఎట్టకేలకు ‘గేమ్‌చేంజర్’ రిలీజ్‌పై ఓ అప్డేట్ ఇచ్చేశారు చిత్ర నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్. ఈ ఏడాది క్రిస్మస్కి గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం అని చెప్పడంతోపాటు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్ని ఖుషీ చేస్తున్నారు. ఇయర్ ఎండింగ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్ నిర్మాతల్లో కనిపిస్తున్నది. లార్జర్ దేన్ లైఫ్ సినిమాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శంకర్.. ఇప్పటివరకూ తీసిన సినిమాలను మించేలా ‘గేమ్‌చేంజర్’ని రూపొందిస్తున్నారని చిత్రయూనిట్ చెబుతున్నది. హీరో రామ్‌చరణ్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మిగతా షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో శంకర్ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు షూరూ అయ్యాయి. పూజా కార్యక్రమంతో చిత్రబృందం డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ‘ఆల్ సెల్ ఫర్ ద మెగా ఫైర్ వర్క్స్ – క్రిస్మస్ 2024’ అంటూ డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సముద్రఖని, ఎస్.జె.సూర్య, సునీల్, నవీన్‌చంద్ర ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.తిరుణావక్కరుసు, స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: తమన్.