Director Atlee | రాజా రాణి వంటి తొలి చిత్రంతోనే తనదైన ముద్ర వేసుకున్న కోలీవుడ్ దర్శకుల్లో అట్లీ ఒకరు. ఆ తర్వాత తెరి, మెర్సల్, విజిల్, జవాన్ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కేవలం సున్నితమైన ప్రేమకథలనే కాకుండ, పదునైన, స్టైలిష్ యాక్షన్ డ్రామాలను కూడా అంతే సమర్థవంతంగా తెరకెక్కించగల సత్తా ఆయనకు ఉందని నిరూపించుకున్నారు. అయితే, అట్లీ తీసే సినిమాలపై తరచుగా ఒక విమర్శ వినిపిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. అట్లీ కాపీ చేస్తాడంటూ ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కాపీ ఆరోపణలపై అట్లీ తాజాగా స్పందించారు.
తన సినిమాల్లో చూపించిన సంఘటనలు, పాత్రలు తన నిజ జీవిత అనుభవాలు లేదా ఇతరుల స్ఫూర్తితో తెరకెక్కించినవే అని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు అట్లీపై వస్తున్న విమర్శలకు ఒకరకంగా సమాధానంగా నిలిచాయి. ప్రస్తుతం అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయి హంగులతో, అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతోందని సమాచారం. ఈ చిత్రం అట్లీ కెరీర్లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సినిమాతో అట్లీ తనపై వస్తున్న విమర్శలకు ఏ మేరకు చెక్ పెడతారో చూడాలి.