నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘మరొక్కసారి’. నితిన్ లింగుట్ల దర్శకుడు. బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో దక్షిణాది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కేరళలోని అందమైన లొకేషన్లతో పాటు క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్న టిబెట్లో అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో చిత్రీకరించామని మేకర్స్ తెలిపారు.
‘సముద్రమట్టానికి 17800 అడుగుల ఎత్తులో ఉన్న గురుడోంగ్కార్ సరస్సు వద్ద చిత్రీకరణ జరుపుకున్న మొదటి భారతీయ సినిమా మాదే కావడం గర్వంగా ఉంది. కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో షూటింగ్ జరిపాం. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి సంగీతం: భరత్ మాచిరాజు, రచన-దర్శకత్వం: నితిన్ లింగుట్ల.