Murali Mohan | తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలు ఊరువాడల అట్టహాసంగా జరుగుతున్నాయి. ప్రజలంతా సంతోషంగా పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. కలలోనూ ఊహించని అభివృద్ధికి అబ్బురపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ పదేండ్లలో వందేళ్ల అభివృద్ధి సాధించామని సబ్బండ వర్గాలు సంబుర పడుతున్నాయి. యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా మారిందని, హైదరాబాద్ విశ్వనగరంగా మారిందని పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ..నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నదని వారు అంటున్నారు. కరెంట్ కోతలు లేని, నీటి ఇబ్బందులు లేని తెలంగాణను చూస్తున్నామని చెబుతున్నారు. సినీ తారలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలందజేశారు.
‘నిన్న మొన్నటి వరకు కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ రాష్ట్రం నేడు పచ్చని పంటలతో అలరారుతున్నది. ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి కృషా,్ణ గోదావరి నీళ్లను ఎత్తిపోతల ద్వారా అంచెలంచెలుగా రాష్ట్రం మొత్తానికి తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. ఈ రోజు వరి సాగులో తెలంగాణ పంజాబ్‌ను మించిపోయింది. ఇంత ఘనత సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రజలకు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నా హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా.
– మురళీమోహన్
2011లో నేను అమెరికా నుంచి హైదరాబాద్‌కు తిరిగొచ్చాను. ఆ సమయంలో ఇక్కడ కరెంట్ కోతలు ఉండే వి. నీళ్లు లేక చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ నేటి తెలంగాణలో అస లు కరెంట్ పోవడం అంటే ఏమిటో తెలియడం లేదు. నిరంతరంగా నీటి సరఫరా జరుగుతున్నది. గచ్చిబౌలి పరిసరాల్ని చూస్తుంటే అమెరికా మాన్హాటన్ తరహాలో కనిపిస్తున్నది. అలాగే నగరంలోని చెరువులను అం దంగా తీర్చిదిద్దుతున్నారు. ఫ్లై ఓవర్స్, మెట్రోతో ట్రాఫిక్ కష్టాలకు కూడా తెరపడింది. తెలంగాణ వైభవాన్ని చూసి నేను, నా కుటుంబ సభ్యులు చాలా గర్వంగా ఫీలవుతున్నాం.
– అడివి శేష్
ప్రజలపై ప్రేమతో పట్టుదలతో పనిచేస్తే ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయో మన తెలంగాణ ప్రభుత్వం నిరూపించింది. ఈ పదేళ్లలో ఎన్నో విజయాలతో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. తెలంగాణ యావత్ ప్రజానీకానికి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలందజేస్తున్నా.
– విజయ్ దేవరకొండ
ఈ దశాబ్ది ఉత్సవాలు తె లంగాణ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతా యి. ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ అ ద్భుత విజయాల్ని సాధించడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తూ రాష్ట్ర సాధనలో వారి త్యాగాల్ని గుర్తుచేసుకుందాం. భవిష్యత్తు తెలంగాణ ప్రగతిలో మనందరం భాగస్వాములమవుదాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, తెలంగాణ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు.
– సాయిధరమ్‌తేజ్
మనం తెలంగాణ సాధించుకుని అప్పుడే పదేండ్లయిందా అనిపిస్తున్నది. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రజలందరికి నా శుభాకాంక్షలు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన..చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తున్నది. ఈ పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన అభివృద్ధి అద్వితీయం..సూపర్‌స్టార్ రజనీకాంత్ లాంటి వ్యక్తి హైదరాబాద్ మరో న్యూయార్క్‌లా ఉందని ప్రశంసించడం మరువలేనిది..ఈ విషయంలో నేను ఒక తెలంగాణ పౌరుడిగా, హైదరాబాద్ వాసిగా గర్వపడుతున్నాను. నేనే కాదు మనమంతా గర్వపడాల్సిన సందర్భమిది. ఈ స్థాయి అభివృద్ధికి కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
-విశ్వక్సేన్
ప్రగతిపథంలో దూసుకెళ్తూ యావత్ దేశానికి తలమానికంగా మారిన శుభ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికి , ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నా.
– గీత రచయిత చంద్రబోస్
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ సోదరసోదరీమణులకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తయ్యాయి. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతిపథంలో పయనిస్తున్నది. దేశంలో అగ్రగామిగా ఎదుగుతున్నది. అభివృద్ధి పథంలో బంగారు తెల ంగాణ కలను నిజం చేసుకుంటున్నాం.
-రామ్‌చరణ్
తెలంగాణ ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు. తెలంగాణ మరింతగా అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలవాలని కోరుకుంటున్నా.
-ప్రభాస్
నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. గత పదేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అంతర్జాతీయ నగరాలకు ధీటుగా హైదరాబాద్ ఎదిగింది. ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా తెలంగాణ పురోగమనం సాధిస్తున్నది.
– నిఖిల్