అగ్ర హీరో ప్రభాస్ సినిమాల వేగాన్ని పెంచాడు. ‘రాజాసాబ్’ ‘ఫౌజీ’ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు) చిత్రాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ‘ రాజా సాబ్’ ఈ వేసవికి ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ‘ఫౌజీ’ సినిమాపై ప్రభాస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెబుతున్నారు. స్వాతంత్య్రోద్యమ కాలం నాటి కథతో తెరకక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఇందులో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా జైలుకు సంబంధించిన ఎపిసోడ్స్‌ను తెరకెక్కిస్తున్నట్లుగా తెలిసింది. ఈ సన్నివేశాలు కథలో కీలకంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నది.