Jaya Jaya Jaya Jaya Hey Movie Remake | ఏదేమైనా మలయాళ సినిమాలకు ఈ మధ్య డిమాండ్ తెగ పెరిగిపోతుంది. మలయాళం నుంచి ఏదైనా సినిమా స్ట్రీమింగ్ అవుతుందంటే క్షణాల్లో జనాల్లోకి వెళ్లిపోతుంది. గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చేస్తున్నాయి. రెండు నెలల క్రితం ఓటీటీలోకి వచ్చేసిని జయ జయ జయ జయహే సినిమా కూడా అదే స్థాయిలో రిలీజైన గంటల్లోనే లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక గతేడాది అక్టోబర్ నెలలో రిలీజైన ఈ సినిమా రూ.50 కోట్లు వసూళ్ చేసి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. కాగా ఇప్పుడీ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేయబోతున్నారు.
బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఫాతిమా సనా షేక్ దంగల్‌తో హీరోయిన్గా మారింది. తొలి సినిమానే తిరుగులేని విజయం సాధించడంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. కాగా ఫాతిమా ఇప్పుడు జయ జయ జయ జయహే సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తుంది. ఈ సినిమాను అమీర్ ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన విపిన్ దాసే రీమేక్ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.