లాస్ ఏంజిల్స్: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిల్మ్ హీరో విన్ డీజిల్(Vin Diesel)పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. 2010లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్కు చెందిన అయిదో చిత్రాన్ని షూట్ చేస్తున్న సమయంలో.. నటుడు విన్ డీజిల్ లైంగిక దాడికి పాల్పడినట్లు అతని పర్సనల్ అసిస్టెంట్ ఆరోపించారు. హీరో తరపున లాయర్ మార్క్ సింక్లెయిర్ ఈ కేసును వాదిస్తున్నారు. పర్సనల్ అసిస్టెంట్ ఆస్టా జొనాసన్ కోర్టును ఆశ్రయించారు.
సినిమాలో ఓ సీన్ కోసం నటన చేస్తూ తనను గోడకు నొక్కి అటాక్ చేసినట్లు ఆస్టా ఆరోపించింది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత తనను ఉద్యోగం నుంచి తీసివేసినట్లు ఆమె తన ఫిర్యాదులో చెప్పింది. లాస్ ఏంజిల్స్ కోర్టులో జొనాసన్ తన కేసును ఫైల్ చేశారు.