FARREY Movie | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) మేనకోడలు అలీజ్ అగ్నిహోత్రి (ALIZEH) గతేడాది సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన విషయం తెలిసిందే. ‘ఫర్రే’ అనే సినిమాతో అలీజ్ అగ్నిహోత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సౌమేంద్ర పథి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2023 నవంబర్ 24న విడుదలైంది. ఈ చిత్రం కమర్శియల్‌గా హిట్ అందుకోకపోయిన అలిజే నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా విడుదలై 5 నెలలు అయిన ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు. అయితే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో ఈ చిత్రం ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. పాఠశాల నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సాహిల్ మోహతా, రోనిత్ బోస్ రాయ్, ప్రసన్న తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. స్కాలర్ షిప్‌తో ఓ పెద్ద పాఠశాలలో సీటు సంపాదించిన నియాతి (అలీజ్ అగ్నిహోత్రి) డబ్బుల కోసం తన స్నేహితులకు పరీక్షల్లో సహాయం చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటుంది. అయితే ఆ సమస్యను ఎలా ఎదుర్కొందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.