Jawan Movie | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘జవాన్’ (Jawan). అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును దాటేసింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రేక్షకులే కాదు టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా చూడటానికి మహారాష్ట్ర జలగన్ నగరంలోని షారుఖ్ ఫ్యాన్స్ ఎండ్లబండ్లు(Bullocks), జేసీబీలు, ట్రాక్టర్లు(Tractors), బైకులపై థియేటర్‌కు వెళుతున్నారు. అయితే సన్నీ డియోల్ (Sunny Deol) నటించిన ‘గదర్-2’ (Gadar 2) కూడా ఇలా ట్రాక్టర్లపై జనాలు సినిమాకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక చాలా సంవత్సరాల తర్వాత షారుఖ్‌ఖాన్ సినిమాకు కూడా ఈ విధంగా థియేటర్‌కు ట్రాక్టర్లలో ప్రేక్షకులు రావడంతో సినీ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Farmers on the way to watch Jawan on Tractor and Bullock.
Jai Jawan Jai Kisan#JawanReview #Nayanthara #Atlee
#जवान #Aryan #Dunki #Jawan#Jawan #JawanBlockBuster #JawanCollection #SRK𓃵 #TheVaccineWar #G20India2023
#VikramRathore #ShahRukhKhan𓃵pic.twitter.com/ahWA4eZUi6— Kabir (@Kabir175) September 9, 2023
జవాన్ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మించింది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా కనిపించాడు. షారుఖ్‌కు జోడీగా నయనతార నటించింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.