Fardeen Khan | ఆ ఇద్దరి 18 ఏళ్ల కాపురానికి ఎండ్ కార్డ్.. విడాకులకు సిద్ధమైన ఫర్దీన్, నటషా..!
Fardeen Khan | నటుడు ఫర్దీన్ ఖాన్, ఆయన భార్య నటషా మాధవి మధ్య విభేదాలు పొడసూపాయి. దాంతో ఆ ఇద్దరి 18 ఏండ్ల కాపురానికి ఎండ్ కార్డ్ పడబోతున్నది. విభేదాల కారణంగా వాళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై: నటుడు ఫర్దీన్ ఖాన్, ఆయన భార్య నటషా మాధవి మధ్య విభేదాలు పొడసూపాయి. దాంతో ఆ ఇద్దరి 18 ఏండ్ల కాపురానికి ఎండ్ కార్డ్ పడబోతున్నది. విభేదాల కారణంగా వాళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఫర్దీన్ ఖాన్, నటషా ఇద్దరూ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత దాదాపు 15 ఏళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది.
ఈ క్రమంలో 2013లో వారికి బిడ్డ డయానీ, 2017లో కొడుకు అజారియస్ జన్మించారు. 2020 తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఏడాది కాలంగా ఫర్దీన్, నటషా విడివిడిగా ఉంటున్నారు. ఫర్దీన్ తన తల్లి కలిసి ముంబైలో ఉంటుండగా, నటషా తన పిల్లలతో కలిసి లండన్లో నివసిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్లిద్దరూ విడాకులకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరూ ఇక కలిసి ఉండటం కుదరదని నిర్ణయించుకోవాలని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, వారి మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

