Jr NTR | నేడు నందమూరి అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆయనకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ.. ఆయన నటిస్తున్న వార్ 2 నుంచి చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. అయితే ఈ టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్‌కి సంబంధించి తన అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సందర్భంగా ఒక నోట్ విడుదల చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తన సినీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ఎప్పుడూ అభిమానులే ముందుగా గుర్తుకొస్తారని ఆయన అన్నారు. “నాకు నిరంతరం తోడుగా ఉండి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన నా ప్రియమైన అభిమానులకు ధన్యవాదాలు” అని ఆయన పేర్కొన్నారు. ‘వార్ 2’ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. “వార్ 2 టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆగస్టు 14న మీరందరూ సినిమాను చూడటానికి నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అని ఆయన తెలిపారు.
అలాగే, తన శ్రేయోభిలాషులు, మీడియా, చిత్ర పరిశ్రమలోని సహోద్యోగులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. “నా శ్రేయోభిలాషులందరికీ, మీడియాకు, చిత్ర పరిశ్రమలోని నా సహోద్యోగులకు మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు బిగ్ థాంక్యూ. ఎప్పటికీ కృతజ్ఞుడిని” అంటూ తన ప్రేమను తెలియజేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
Thank you. pic.twitter.com/62BsFWHKHP
— Jr NTR (@tarak9999) May 20, 2025