నాగ చైతన్యని వివాహం చేసుకొని అక్కినేని కోడలిగా మారిన సమంత ఇటీవల తన సోషల్ మీడియా పేజీలలో అక్కినేని పేరు తొలగించి హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని పేరు ఎప్పుడైతే తొలగించిందో అప్పటి నుండి భిన్న కథనాలు వినిపించాయి. అత్త మామలతో గొడవ అని కొందరు అంటే, మరి కొందరు భర్తతో విభేదాలు మరి కొందరు చెప్పుకొచ్చారు. మనస్పర్థల కారణంగా ఈ స్టార్ కపుల్ విడిపోతున్నారని కొన్ని వెబ్‌సైట్స్ కూడా అనేక కథనాలు ప్రచురించాయి.
ఆదివారం సమంత మామ కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక్క ట్వీట్ తో అక్కినేని ఫ్యామిలీకి దూరం అవుతున్నారనే పుకార్లను పటాపంచలు చేసేసింది. మీ మీద ఉన్న నాకు ఉన్న గౌరవాన్ని వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు మామ అంటూ సామ్ కామెంట్ చేసే సరికి సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లన్నీ అబద్ధాలే అని అభిమానులు డిసైడ్ అయ్యారు.
అయితే రీసెంట్గా నాగ్ బర్త్‌డేకి సంబంధించి ఒక ఫొటోల బయటకు రాగా, అందులో చైతూ, అఖిల్, అమలతో పాటు కొందరు సభ్యులు ఉన్నారు.అయితే సమంత కనిపించకపోయే సరికి అనుమానాలు మళ్లీ పెరిగాయి. సమంత రాకపోవడానికి అసలు కారణం ఏంటంటే ఆమె ప్రస్తుతం తమిళ చిత్ర షూటింగ్లో భాగంగా తమినాడులో ఉంది. ఈ కారణంగానే సమంత.. నాగ్ బర్త్‌డేకి హాజరు కాలేదని సమాచారం.