16 Years Of Ram Charan | మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా చిరుత (Chirutha) సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్ (RAMCHARAN) . డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రాంచరణ్‌కు యాక్టర్‌గా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టాడు. 2013లో Zanjeer (తెలుగులో తుఫాన్) సినిమాతో బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చాడు.
చిరుత సినిమా 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. రంగస్థలం సినిమాలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన రాంచరణ్ ఇండస్ట్రీకి వచ్చి నేటితో 16 ఏండ్లు పూర్తయింది. మెగాస్టార్ తనయుడిగా కెరీర్ షురూ చేసి.. తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిన రాంచరణ్.. ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. వరల్డ్‌వైడ్‌గా ఉన్న దిగ్గజ దర్శకుల ఫోకస్‌ను తనవైపునకు తిప్పుకున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతంగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. వినోదాన్ని అందిస్తోన్న రాంచరణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మూవీ లవర్స్, అభిమానులు. భవిష్యత్‌లో మరిన్ని సక్సెస్ఫుల్ సినిమాలను అందించి.. హీరోగా ఎన్నో విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ప్రస్తుతం రాంచరణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). ఆర్సీ 15 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోలు భామ అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చి బాబు దర్శకత్వంలో RC16ను కూడా ప్రకటించాడు రాంచరణ్.
రాంచరణ్ 16 ఏండ్ల జర్నీ..
He came 🐆
He saw 🔥
He Conquered Like KING 👑From MEGA POWER STAR to 𝐆𝐋𝐎𝐁𝐀𝐋 𝐒𝐓𝐀𝐑 the way he Evolved and Emerged As Biggest Ever MASS Hero is really 💥@AlwaysRamCharan garu ❤️A True GLOBAL Phenomenon
Hearty congratulations on 16 Yrs in TFI… pic.twitter.com/qAPaSkU7Ud— BA Raju’s Team (@baraju_SuperHit) September 28, 2023
నెట్టింట అభిమానుల శుభాకాంక్షలు ఇలా..
The Debut Anyone can only dream of !!
16 Years for the Best Debut Ever in the History of Cinema. A Star is Emerged just by the End of the Title Song of the Movie 🔥#16YearsOfRAMCHARANsGlory @AlwaysRamCharan #PuriJagan @VyjayanthiFilms pic.twitter.com/e2VhrLtevL
— RamuCharan143 (@ramucharan4life) September 28, 2023
He came 🐆
He saw 🔥
He Conquered Like KING 👑#16YearsOfRAMCHARANsGlory pic.twitter.com/MNBtw0yyQS— 𝐒ιмαη¢нαℓ𝐂𝐡𝐞𝐫𝐫𝐲° (@Simanchalcherry) September 28, 2023
Thank You for existing anna @AlwaysRamCharan
We will celebrate you till the end ❤️
To Many more occassions ahead….Jai Charan ✊#16YearsOfRAMCHARANsGlory pic.twitter.com/1MurGv4lBk— Team RamCharan Vizag (@TeamRC_Vizag) September 28, 2023