Prabhas | ప్రభాస్-చరణ్ మధ్య ఇంత మంచి బాండింగ్ ఉందా.. షాక్‌లో మెగా డార్లింగ్ అభిమానులు
ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'అన్‌స్టాపబుల్-2' బాహుబలి ఎపిసోడ్ 'ఆహా'లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా సరికొత్త రికార్డులు కూడా కొల్లగోడుతుంది.
Unstoppable-2 Prabhas Episode | ఎప్పుడెప్పుడా అని ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘అన్‌స్టాపబుల్-2’ బాహుబలి ఎపిసోడ్ ‘ఆహా’లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఎక్కడా చూసిన ఇదే ట్రెండింగ్‌లో ఉంది. అంతేకాకుండా సరికొత్త రికార్డులు కూడా కొల్లగొడుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ ఎపిసోడ్.. మొదటి పార్టు గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఆహాలో విడుదలైన ఈ ఎపిసోడ్ పన్నెండు గంటల్లోనే 50మిలియన్ మినట్స్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఎంటర్టైనింగ్ సాగింది. కాగా ఈ ఎపిసోడ్లో ప్రభాస్, రామ్‌చరణ్‌కు కాల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.
డార్లింగ్ మీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతాడంటూ చరణ్, ప్రభాస్ మ్యారేజ్‌పై హింట్ ఇచ్చాడు. అంతలో బాలయ్య రెడ్డినా?, చౌదరీనా?, సనన్ హా?, శెట్టీనా? అంటూ చరణ్‌ను అడిగాడు. దానికి చరణ్ అది తాను చెప్పలేనని, మీరే ఊహించుకోండని ప్రభాస్‌ను ఇరికించాడు. దాంతో ప్రభాస్ ‘రేయ్.. ఏం మాట్లాడుతున్నావ్ డార్లింగ్ నువ్వు నా ఫ్రెండువా? శత్రువా?’ అంటూ చరణ్‌కు ఫోన్ కాల్లో రిప్లై ఇచ్చాడు. అంతేకాకుండా ప్రభాస్ లైఫ్‌లో ఇప్పటికైతే ఏ అమ్మాయి లేదని కూడా చెప్పాడు. ప్రభాస్ రేయ్ రేయ్ అని మాట్లాడటం. చరణ్ కూడా డార్లింగ్ డార్లింగ్ అంటూ అనడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుంది. వీళ్ళిద్ధరి మధ్య బాండింగ్ ఇంతలా ఉందా అని అనుకుంటున్నారు. ఈ బాండింగ్‌ను చూసి అటు మెగా అభిమానులు, ఇటు ప్రభాస్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా వీరిద్ధరూ రాజమౌళి కొడుకు ఎస్.ఎస్ కార్తికేయ పెళ్లిలో క్లోజ్ అయినట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

