Lucifer 2 Empuraan | మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఎల్2 ఎంపురాన్(L2 Empuraan). బ్లాక్ బస్టర్ చిత్రం లుసిఫర్ (Lucifer) సినిమాకి ఈ చిత్రం సీక్వెల్‌గా వస్తుంది. నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. మంజు వారియర్ (Manju Warrier), టోవినో థామస్(Tovino Thomas) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు పృథ్వీరాజ్.
అయితే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైకి వెళ్లిన పృథ్వీరాజ్ తాజాగా రజనీకాంత్‌ను కలిశారు. చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీకాంత్ నివాసంకు వెళ్లిన పృథ్వీరాజ్ తలైవని కలిసి బ్లెసింగ్స్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన రాసుకోస్తూ.. ఎల్2 ఎంపురాన్(L2 Empuraan) ట్రైలర్‌ను మొదట రజనీకాంత్‌కి చూపించాను. ఆయన ఈ వీడియో చూశాక చెప్పిన మాటలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. మీకు ఎప్పటికీ వీరాభిమానినే అంటూ పృథ్వీరాజ్ రాసుకోచ్చాడు. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
The very first person to watch the trailer of #L2E #EMPURAAN I will forever cherish what you said after watching it Sir! This meant the world to me! Fanboy forever! @rajinikanth #OGSuperstar pic.twitter.com/Dz2EmepqdZ
— Prithviraj Sukumaran (@PrithviOfficial) March 18, 2025
రజనీకాంత్‌పై ఉన్న అభిమానాన్ని పృథ్వీరాజ్ గతంలో కూడా చాటుకున్న విషయం తెలిసిందే. తనకి ఛాన్స్ దొరికితే రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌లతో సినిమా చేస్తానని ఒక ఇంటర్వ్యూలలో ఆయన వెల్లడించాడు.