Harshvardhan rane | ఒక్కోసారి సినిమా స్టార్స్‌కి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఆ సమయంలో వారు చూపించే తెగువ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. తాజాగా ఓ యువతి తన ఫేవరెట్ హీరోని చూసి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. కన్నీటి పర్యంతం అవుతూ తన మనసులో ఉన్నది వెంటనే ఆ హీరో ముందు చెప్పేసింది.. తన అభిమాని కన్నీటి పర్యంతం అవుతున్నప్పుడు యువహీరో హర్షవర్ధన్ రాణే స్పందించిన తీరు మనసుల్ని గెలుచుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హర్షవర్ధన్ రాణే గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు.
హర్ష వర్ధన్ నటించిన సనమ్ మేరీ కసమ్ రీ రిలీజ్ లో ఏకంగా 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. తకిట తకిట సినిమాతో హీరోగా పరిచయమైన హర్షవర్ధన్, ఆ తర్వాత నా ఇష్టం, అవును, ప్రేమ ఇష్క్ కాదల్, మాయ, ‘ఫిదా’, బెంగాల్ టైగర్, అవును, అవును 2, అనామిక, గీతాంజలి, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి తదితర చిత్రాలలో నటించి మెప్పించారు. ఇప్పుడు బాలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు. అయితే హర్షవర్ధన్ రాణే ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు ఆయనని చూసిన అభిమాని వెక్కి వెక్కి ఏడ్చింది. ఎయిర్ హోస్టెస్‌లు ఆ యువతిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. కాని ఆ మహిళా అభిమాని ఎమోషనల్ అవుతూనే ఉంది.
ఆ సమయంలో రాణే తన అభిమాని దగ్గరకి రాగా, యువతి ఇలా మాట్లాడింది. ప్రజలు ఒకరి కోసం ఎలా ఏడుస్తారో అనుకునేదానిని.. కానీ నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.. అందుకే నేను ఏడుస్తున్నాను. నేను మీ సినిమా చూసినప్పుడు ఎనిమిదో తరగతిలో ఉన్నాను. మూడు సంవత్సరాలైంది. మీ సినిమాను సగం మాత్రమే చూసి అప్పటి నుండి మీరే నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తిగా మారాను అని హర్షవర్ధన్ పై అభిమానం చాటుకుంది. ఆ సమయంలో హర్షవర్ధన్ .. దేవుడు నిన్ను దీవించుగాక, నేను నిన్ను గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను అని అన్నాడు. ఈ వీడియో నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.