ఖలీల్‌వాడి ( నిజామాబాద్) : నిజామాబాద్ ( Nizamabad) జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లిలో ప్రసిద్ధిగాంచిన ఇందూరు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు (Brahmotsavams) ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు శుక్రవారం జరిగిన ఉత్సవాల్లో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ( Dil Raju) , ఆయన సోదరులు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, నాయకులు పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేష వాహనంపై స్వామిని ఊరేగించారు.
ఆచార్య గంగోత్రి రామానుజదాసు స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శేష వాహనం వల్ల నాగ దోషాలు తొలిగిపోతాయని స్వామి అన్నారు. యజ్ఞాచార్యులు ఆచార్య శిఖామణి స్వామి, శ్రీకర్ కుమారాచార్యులు, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామిల ఆధ్వర్యంలో పూజాదికార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో నాయకులు నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, నరేందర్, రాజేశ్వర్, రమేష్, సాయిలు, భాస్కర్, మురళి, చిన్నయ్య, గంగారెడ్డి, నరేష్, సురేష్, రవి, పాల్గొన్నారు.
,