Sirivennela Seetharama Sastry : సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
సిరివెన్నెల సీతారామశాస్త్రికి అస్వస్థత | ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజుల క్రితమే సిరివెన్నెల కిమ్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఆయన గత కొన్ని రోజుల నుంచి న్యుమోనియాతో బాధపడుతున్నారు. దీంతో దానికి చికిత్స తీసుకునేందుకే ఆయన కిమ్స్‌లో చేరినట్టు తెలుస్తోంది. ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని ఇంకా కిమ్స్ వైద్యులు వెల్లడించలేదు.
సినీ గేయ రచయితగా సిరివెన్నెల 1986లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. సిరివెన్నెల సినిమాతోనే ఆయన ఫేమస్ అవడంతో.. ఆయన ఇంటిపేరు సిరివెన్నెలగా మారిపోయింది. అదే సినిమాకు ఆయనకు ఉత్తమ లిరికిస్ట్‌గా నంది అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆయన తెలుగులో వందల సినిమాలకు పాటలు రాశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

