ప్రముఖ నాయిక హన్సిక మోత్వానీ వివాహం వ్యాపారవేత్త సొహైల్ కతూరియాతో ఘనంగా జరిగింది. రాజస్థాన్ జైపూర్‌లోని ఓ కోటలో సింధీ సంప్రదాయం ప్రకారం వీరు వివాహం చేసుకున్నారు. పలువురు సినీ రాజకీయ రంగ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. గత వారం నుంచే హన్సిక పెళ్లి సందడి మొదలైంది. శుక్రవారం సూఫీ నైట్ వేడుకను జరిపారు.
ప్రీ వెడ్డింగ్‌లో వధూవరులు పాటలకు డ్యాన్సులు చేశారు. హన్సిక వెడ్డింగ్ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్న హన్సిక తను సహాయం అందిస్తున్న చిన్నారులనూ పెండ్లికి పిలిచింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త సొహైల్ కతూరియా గత నెల హన్సికకు ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ వద్ద పెండ్లి ప్రపోజల్ చేశాడు.