Sudigali Sudheer | సుడిగాలి సుధీర్.. జబర్ధస్త్ షోతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ అందిపుచ్చుకున్నాడు.ఆ క్రేజ్‌తో టాలీవుడ్ వెండితెరపైకి అడుగుపెట్టారు. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేయడమే కాకుండా, హీరోగా కూడా అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్ కొద్ది రోజుల కిందట వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించేవాడు. కాని ఇప్పుడు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు షోలకు హోస్టుగా చేస్తున్నారు. సుధీర్ ..గత కొద్ది రోజులుగా రష్మీ ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలొచ్చాయి. త్వరలో వారిద్దరు వివాహం చేసుకోబోతున్నారంటూ కూడా పుకార్లు వచ్చాయి.
అయితే మేము మంచి స్నేహితులం, ఇవన్నీ సెట్స్ వరకే అంటూ ఇద్దరూ చాలా సార్లు ప్రేమ పుకార్లని ఖండించారు. అయితే ఇద్దరు ప్రేమలో లేనప్పుడు వేరే వారిని అయిన పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. దానికి సమాధానం మాత్రం ఇవ్వడం లేదు. అయితే సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఫ్యామిలీ స్టార్స్ అనే ఒక షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. ఈ షోలో యాంకర్ స్రవంతి, అషురెడ్డి, జబర్దస్త్ పవిత్ర లు తెగ సందడి చేస్తుంటారు. రీసెంట్ గా లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజయింది.
ఈ ప్రోమోలో యాంకర్ స్రవంతి – అషురెడ్డి ఇద్దరూ డ్యాన్స్ వేస్తూ మధ్యలో సుధీర్ ని లాగి కాస్త ఓవర్ గా ప్రవర్తించడం చూసి నెటిజన్స్ అవాక్కవుతున్నారు. అలాగే ఇదే ప్రోమోలో జబర్దస్త్ పార్వతి ఏకంగా ఎగిరి సుధీర్ చంకెక్కింది. అలా రెండు సార్లు చేసింది. దీంతో అక్కడున్న వాళ్ళు నోరెళ్లపెట్టారు. అయినా అదే కామెడీ అన్నట్టు ప్రోమోని ప్రమోట్ చేస్తూ నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొందరు ఈ ప్రోమోపై విమర్శలు చేస్తున్నారు. మరి కొందరు మాత్రం సుధీర్ అన్న క్రేజ్ అలాంటిది మరి, అందుకే అలా చేస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైన కామెడీ అని చెప్పి ఇలా శృతి మించడంపై కొందరు పెదవి విరుస్తున్నారు.