స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ప్రతాని రామకృష్ణగౌడ్ రూపొందించిన చిత్రం ‘దీక్ష’. కిరణ్, అలేఖ్య రెడ్డి జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెలాఖరున విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్.కె.గౌడ్ మాట్లాడుతూ..
దీక్ష, పట్టుదలతో పనిచేస్తే ఎంతటి కార్యాన్నైనా సాధించవొచ్చనే సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ఇప్పటికే విడుదలైన ఐదు పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని, తమ సంస్థకు గొప్ప పేరు తీసుకొచ్చే చిత్రమవుతుందని చెప్పారు. నేటి యువతరంలో స్ఫూర్తినింపే సినిమా ఇదని హీరో కిరణ్ పేర్కొన్నారు. ఆర్.కె.ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ పతాకాలపై ఆర్.కె.గౌడ్, అశోక్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.