Faima | తెలుగు బుల్లితెరపై గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మంది టాలెంటెడ్ అమ్మాయిలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే, వారిలో కొద్దిమంది మాత్రమే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించి వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ ఫైమా ఒకరు. చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్‌గా మారిన ఈ లేడీ కమెడియన్.. ప్రస్తుతం కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్ కారణంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. టీనేజ్లోనే ‘పటాస్’ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫైమా.. ఆ తర్వాత ‘జబర్ధస్త్’ షోలో తనదైన కామెడీ టైమింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. కొద్ది కాలంలోనే సెలెబ్రిటీ స్టేటస్‌ను అందుకున్న ఈ అమ్మడు.. అనేక షోలు, ఈవెంట్లలో పాల్గొంటూ బిజీగా మారింది.
జబర్ధస్త్ ఫైమా బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆటతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఫినాలే ముందు ఎలిమినేట్ అయినప్పటికీ, షో తర్వాత ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.బిగ్ బాస్ తర్వాత ఫైమాకు వచ్చిన ఫాలోయింగ్‌కు తగ్గట్టుగానే ఆఫర్లు కూడా భారీగా వచ్చాయి. ఈ క్రమంలోనే స్టార్ మా లో ప్రసారమైన ‘బీబీ డ్యాన్స్’ షోలో సూర్యతో కలిసి విజేతగా నిలిచింది. ఆ తర్వాత స్టార్ మా ఈవెంట్లలో తరచూ కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఫైమా పర్సనల్ లైఫ్ కూడా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ‘పటాస్’ రోజుల నుంచే ప్రవీణ్‌తో ప్రేమాయణం సాగించిందనే ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలను ఫైమానే ఖండిస్తూ.. తాను అతడిని ఎప్పుడూ ప్రేమించలేదని స్పష్టం చేసింది. అయితే ఈ అమ్మడు గత కొద్ది రోజులుగా ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని జోరుగా ప్రచారం జరిగింది. ఎట్టకేలకి దానికి ఇప్పుడు చెక్ పెట్టింది. మాల్లో అతని బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా నిర్వహించింది ఫైమా. అందుకు సంబంధించిన పిక్స్ షేర్ చేయగా, ఇవి వైరల్‌గా మారాయి. ఈ పిక్స్‌లో ఫైమా తన ప్రియుడికి పలు గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్టు అర్ధమవుతుంది.